పాడేరు: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్న వైనం

0చూసినవారు
పాడేరు: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్న వైనం
ముంచంగిపుట్టు మండలంలోని తుముడిపుట్టు గ్రామ గిరిజనులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోంటున్నారు. లక్ష్మీపురం పంచాయతీకి చెందిన ఈ గ్రామంలో నివసించే 120 కుటుంబాలు నిత్యావసరాల కోసం లక్ష్మీపురం వెళ్లాల్సి వస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో గిరిజనులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటి నిత్యవసరాలు తెచ్చుకుంటున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్