ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర మే 11, 12, 13 తేదీల్లో జరగనుంది. మంగళవారం విద్యుత్ అలంకరణకు ముహూర్తపురాట వేసిన మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బురెడ్డి రాము, ఉత్సవ కమిటీ సభ్యులు కేజీయా రాణి, జవ్వాది శ్రీను, బేరా నాని పాల్గొన్నారు.