పాడేరు ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు పాడేరు డిపో నుంచి అదనంగా మరో మూడు రూట్లలో పల్లె వెలుగు సర్వసులను నడిపేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ప్రజా రవాణా అధికారి టి. ఉమామహేశ్వరరెడ్డి శనివారం తెలిపారు. ప్రతీ గ్రామానికి బస్సులు నడిపి ఆర్టీసీ ఆదాయం పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. పల్లె వెలుగు సర్వీసులను 17వ తేదీన ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ ఎస్. దొన్నుదొర ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.