పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్ధావరాలపై "ఆపరేషన్ సిందూర్" పేరుతో భారత్ దాడి చేసింది. ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో ఈ నెల 17న పాడేరులో తిరంగ యాత్ర ర్యాలీ చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంతి కుమారి తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ర్యాలీలో పాల్గొని అమరులైన భారత జవానులకు సంఘీభావం తెలుపుదామన్నారు.