పాడేరు మండలంలోని మోదపల్లికి రూ. 25 లక్షల పంచాయితీ నిధులతో నూతన పంచాయితీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కొర్ర. మంగమ్మ ఎంపీటీసీ ఈశ్వరరావు మంగళవారం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ. మోదపల్లికి పంచాయతీ భవనం లేక గిరిజనులు ఇబ్బందులు పడేవారన్నారు. పంచాయతీ భవనం మంజూరు కావడంతో వారి కష్టాలు తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పంచాయతీ ప్రజలు తదితరులు ఉన్నారు.