పాడేరు: యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరిస్తాం

81చూసినవారు
పాడేరు: యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరిస్తాం
జిల్లా సర్వజన ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డా. పి. విశ్వమిత్ర తెలిపారు. మంగళవారం జిల్లా ఆసుపత్రిలో ఉన్న రెండు మోటార్లలో ఒక మోటారు మరమ్మతులకు గురైందని ఆసుపత్రి ఇన్ పేషెంట్లు సూపరిండెంట్ దృష్టి కి తీసుకుని వెళ్లడంతో ఆమె సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆమె ఎపి ఎం ఐడిసి ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే మోటారు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్