పాడేరు మండలం కుజ్జలి గ్రామ పంచాయతీ ఎగుమోదపుట్టు గ్రామంలో శనివారం పీసా కమిటీ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో కాండ్రంగిపాడు, జోడిమామిడి, వై. మోదపుట్టు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జోడిమామిడి గ్రామం నుంచి కొర్ర శివ కుమార్ ని ఉప అధ్యక్షుడిగా, వై. మోదపుట్టు గ్రామం నుంచి కె. మహేష్ ని కార్యదర్శిగా మూడు గ్రామాల ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.