అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ సుర్తిపల్లి గ్రామంలో సుమారు 90 ఏళ్ల నుండి గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్న 50 కుటుంబాలున్న.. కనీసం ప్రభుత్వాలు రోడ్డు సౌకర్యం కూడ కల్పించాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలకు పాడేరు లేదా లోత్తుగెడ్డ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలన్న మా గ్రామం నుండి సుమారు 5 కిల్లో మీటర్లు దూరం వెళ్ళితే కానీ తారురోడ్డు వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మా గ్రామస్తుల కష్టాలను, పరిగణలోకి తీసుకోని మా సమస్య పరిష్కారం చేయాలని సుర్తిపల్లి గ్రామస్తులు ప్రభుత్వన్ని కోరుతున్నారు.