నక్కపల్లి: తిరువీధుల్లో మెరిసిన దేవదేవుడు

78చూసినవారు
నక్కపల్లి: తిరువీధుల్లో మెరిసిన దేవదేవుడు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఉపమాక క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి తిరువీధిసేవ కన్నుల పండువగా జరిగింది. ప్రపంచంలో ఏ క్షేత్రంలోనూ జరగని విధంగా ఒకే రోజు 8 వాహనాలపై తిరువీధి సేవ జరగడం ఉపమాక క్షేత్రంలోనే కావడం విశేషం. ఈ మేరకు పుణ్యకోటి వాహనంపై ఉభయదేవేరులతో కూడి, శ్రీరంగనాధుడిగా శ్రీవారు దర్శనమివ్వగా, వెనుక రాజాధిరాజ వాహనంపై గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్