కోటఉరట్ల మండలం కే. వెంకటాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ కాళ్ళ రత్నం, మండల టీడీపీ యూత్ అధ్యక్షులు తిరుమలరావు, జనసేన నాయకులు బాలరాజు, స్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.