మండల కేంద్రమైన కోటవురట్ల పంచాయతీ పరిధి రాట్నాలపాలెంలో సోమవారం మండల తెదేపా అధ్యక్షుడు జానకి శ్రీను ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను స్థానికులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమoలో తెదేపా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.