అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దగ్గుపల్లి సాయిబాబాని అనకాపల్లి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడుతూ, నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటానన్నారు.