కైలాసపట్నం శివారులో మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 8 మంది మృతిచెందగా మరో ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. కోటవురట్ల మండలంలో రాజుపేట, చౌడువాడ, కైలాస పట్నం గ్రామాలకు చెందిన సేనాపతి బాబురావు, గుంపిన వేణుబాబు, దాడి రామలక్ష్మి, సంగరాతి గోవిందు, పురం పాప, హేమంత్, దేవర నిర్మల, తాతబాబు మృతి చెందిగా వారి కుటుంబాలకు బుధవారం హోంమంత్రి అనిత చేతుల మీదుగా రూ.15 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాధితులు కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు.