అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణా సంచా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని స్థానిక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి హోం మంత్రి అనిత పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చోడవరం, రావికమతం, నక్కపల్లి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఫైర్ ఇంజన్ల ద్వారా ఘటనా స్థలంలో వ్యాపించిన మంటలను వేగంగా అదుపు చేయగలిగారని చెప్పారు.