అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో బాణాసంచ తయారీ కేంద్రంలో ప్రమాదం పట్ల పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కంబాల జోగులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు త్రీవంగా గాయపడడం తీవ్ర విచారకరమన్నారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.