అనకాపల్లి: జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ రాజు నియామకం

70చూసినవారు
అనకాపల్లి: జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ రాజు నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా కోటవురట్ల మండలం మాజీ ఉపాధ్యక్షులు రాజా సాగి సత్యనారాయణ రాజుని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, నమ్మి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పదవి ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పాయకరావుపేట నియోజకవర్గం ఇంఛార్జ్ కంబాల జోగులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటానని పార్టీ కోసం కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్