మండల కేంద్రమైన కోటఉరట్లలో అల్పపీడనం ప్రభావంతో మంగళవారం భారీ వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కాచిన ఎండకు ఉక్క పోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరట ఇచ్చింది. అయితే ఈ వాన మామిడి పంటకు నష్టం కలిగిస్తుందని కే. వెంకటాపురం, తిమ్మాపురం, కొడవటిపూడి, బీకేపల్లి, పీకే పల్లి, చిన్న బొడ్డేపల్లి, బోడపాలెం గ్రామాల మామిడి తోటల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.