పాయకరావుపేట మండలంలోని నామవరం గ్రామస్థులతో గురువారం హోం మంత్రి వంగలపూడి అనిత ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోం మంత్రి అనిత ప్రజలతో మమేకం అవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధింత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు.