ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సచివాలయం లాగిన్ బయట ఇంటర్నెట్ షాప్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద రూ.30 వసూలు చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మంగళవారం ఆరోపించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పనులను సచివాలయంలో ఉద్యోగులు చేయాల్సి ఉండగా సాయంత్రం సమయాల్లో బయట వ్యక్తులకు లాగిన్ ఇచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.