కోటఉరట్ల: ఆకట్టుకున్న విద్యార్థుల సూర్య నమస్కారాలు

77చూసినవారు
రథసప్తమి సందర్భంగా మంగళవారం కోటఉరట్ల మండలం, పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి. పీడీ అచ్యుతరావు ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.  అన్ని దైవాల కన్నా సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమని అన్నారు. సూర్య భగవానునికి నమస్కారాలు చేస్తే ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అన్నారు. ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్