కోటవురట్ల మండలం పత్రిక విలేకరుల ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ స్థాయి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన మండలి సభ్యులు డి.వి సూర్యనారాయణరాజు, జడ్పీటీసీ సభ్యులు ఉమాదేవి, మండల ఉపాధ్యక్షులు సీతబాబు రాజు, వివిధ పార్టీ నాయకులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉత్తరాంధ్ర జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.