ఎస్ రాయవరం కూడలి నందు ముందుగా రాబడిన నమ్మకమైన సమాచారం ప్రకారం శనివారం 26 మద్యం బాటిల్లతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ విభూషణ్ రావు తెలిపారు. ఆ వ్యక్తి సైతార్ పేట గ్రామానికి చెందిన గజ్వల్లి రామకృష్ణ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ విభూషణ్ రావు మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.