నక్కపల్లి మండలంలోని చినతినార్ల గ్రామంలో మంగళ అభయ ఆంజనేయస్వామి 19వ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంబాల అమ్మోరయ్య ఆద్వర్యంలో ఈ సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో నిర్వహించారు. సుప్రభాత సేవలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పలు ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీషా ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.