నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ సోమవారం మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. కొందరు జర్నలిస్టులమని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమరావతిపై కొమ్మునేని, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.