నక్కపల్లి మండలం రేబాకలోని గూడుపమ్మ తల్లి ఆలయ భద్రత కోసం ఓ దాత నాలుగు సీసీ కెమెరాలు, సాంకేతిక పరికరాలు ఆదివారం విరాళంగా అందించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.28,000 విలువైన ఈ పరికరాలను ఆదివారం అందజేశారని ఆలయ ధర్మకర్త శ్రీహరి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ కే.లలిత పాల్గొన్నారు.