తొలి ఏకాదశి పూజల అనంతరం ఆదివారం సాయంత్రం ఉప్మాకలో స్వామివారు కొలువైన గరుడాద్రి పర్వతం చుట్టూ భక్తుల గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. శ్రీనివాసా భజన భక్త సమాజం భక్తులు, నక్కపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన శ్రీవారి సేవకులు, అనేక మంది మహిళా భక్తులు తరలివచ్చారు. భజన గీతాలు, గోవిందనామస్మరణతో భక్తులంతా గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతీ ఏటా తొలి ఏకాదశి రోజు గరుడాద్రి చుట్టూ తిరగడం ఆనవాయితీగా వస్తోంది.