నక్కపల్లిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తిరంగా ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి భారత్ మాతాకీ జై వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. భారత సైనికులు విరోచితంగా పోరాడుతున్నట్లు తెలిపారు పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ కు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించడం గర్వకారణంగా పేర్కొన్నారు.