నక్కపల్లి: జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

8చూసినవారు
నక్కపల్లి: జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
తాజాగా వాతావరణం మారడంతో జలుబు, జ్వరం, తలనొప్పులు భాదిస్తున్నాయి. వర్షాల కారణంగా పారిశుద్ధ్య లోపాలు, శుద్ధిచేయని తాగునీటి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగాయి. నక్కపల్లి ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగింది. రెండు వారాల్లో 200 జ్వరం, 50 డయేరియా కేసులు నమోదయ్యాయి. కాచి చల్లార్చిన నీరు తాగాలని, బయటి ఆహారానికి దూరంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్