నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం తోట ఉత్సవం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా రాజాధిరాజు వాహనంపై సమీపంలో గల లక్ష్మీపురం స్వామి వారి తోటలోకి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.