మండల కేంద్రమైన నక్కపల్లిలో టిడిపి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 50 టీములు పాల్గొంటున్నాయి. పది రోజులు పాటు పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేష్, జానకి శ్రీను, కొప్పిశెట్టి బుజ్జి పాల్గొన్నారు.