రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఈనెల 13న నుంచి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. నక్కపల్లి హెట్రో గ్రౌండ్స్ లో పోటీలు జరుగుతాయని మండలం టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. మొదటి బహుమతి రూ. 1,00,000, ద్వితీయ బహుమతి కింద రూ. 50, 000 విజేతలకు అందజేస్తామన్నారు. నియోజకవర్గానికి చెందినవారే పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు.