బుధవారం నక్కపల్లి మండలం దొండవాక గ్రామంలో వైసీపీ కార్యకర్త లోకనాథం ఓ పనిమీద మహారాష్ట్ర వెళ్లగా ప్రమాదంలో గాయపడి స్వగ్రామానికి చేరుకోగా, విషయం తెలుసుకున్న నక్కపల్లి మండల వైసీపీ అధ్యక్షులు శీరం నరసింహమూర్తి లోకనాథంని పరామర్శించారు. మరో కార్యకర్త మోహన్ ఆరోగ్యరిత్యా శస్త్రచికిత్స విషయం తెలిసి మోహన్ ను కలిసి మనోధైర్యాన్నిచ్చారు. ఎరుపల్లి నాగేష్, మేరుగు కొర్లయ్య, కాశీ, తాతారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.