నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. గ్రామంలో వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కళ్యాణ మహోత్సవాలు ఈనెల 15వ తేదీన ముగిసినా తీర్థం కొత్త అమావాస్య ముందు రోజు వరకు కొనసాగుతుందని వివరించారు. రోజు వేలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారన్నారు.