నక్కపల్లి మండలంలో ఉన్న వివిధ గ్రామాల ప్రధాన రహదారి మార్గాలతోపాటు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు నక్కపల్లి సర్కిల్ ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు ఎస్ ఆర్ య కంపెనీ పోలీసులకు సహకారం అందించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని ఉత్తమ జంక్షన్ వద్ద ఉన్న గోతులను సీఐ కే కుమార్ స్వామి ముందుగా పూర్తిచేసి 40 ఎంఎం డంబుల్స్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు.