నక్కపల్లి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను హోంమంత్రికి అందజేశారు. వాటిని పరిశీలించిన మంత్రి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.