నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి తిరువీధి సేవ నిర్వహించి పుణ్యకోటి వాహనంపై వెంకటేశ్వర స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిత్య సేవా కాలం, విశేష ప్రసాద నివేదన, తీర్థగోష్ఠి, ప్రసాద వినియోగం కార్యక్రమాన్ని నిర్వహించారు.