నక్కపల్లి: హంస వాహనంపై ఊరేగిన వెంకన్న

58చూసినవారు
నక్కపల్లి: హంస వాహనంపై ఊరేగిన వెంకన్న
నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామికి తిరువీధి సేవ నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటేశ్వర స్వామిని హంస వాహనంపై అదిష్టింప చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో నిత్య సేవా కాలం, విశేష ప్రసాద నివేదన, తీర్థగోష్ఠి ప్రసాద వినియోగం కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్