పాయకరావుపేట: పాఠశాలలో ముందుగానే అంబేద్కర్ జయంతి

72చూసినవారు
పాయకరావుపేట: పాఠశాలలో ముందుగానే అంబేద్కర్ జయంతి
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరం అగ్రహారం పాఠశాలలో ముందుగా డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిల్లలు డా బి ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన పేదరికంలో పుట్టి ఉన్నతి చదువులు చదివి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. ఏప్రిల్ 14 పాఠశాలకు సెలవు కారణంగా శనివారం డా బి ఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్