అంబేద్కర్ జయంతి సందర్భంగా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఎం శివయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన , బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకు అన్ని రకాల హక్కులు స్వేచ్ఛను అందించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు మనమందరం అంటరానితనాన్ని తరిమికొట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.