పాయకరావుపేట: సాగులో మెళుకువలు పాటించాలి

72చూసినవారు
పాయకరావుపేట: సాగులో మెళుకువలు పాటించాలి
పంటల సాగులో మెలకువలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని పాయకరావుపేట మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ సూచించారు. బుధవారం మంగవరం, పెంటకోట గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రబీలో సాగు చేస్తున్న వరి పంట సాగుపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పై అవగాహన కల్పించారు. ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్