ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో బుధవారం ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని నాగలితో పొలం దున్నారు. అంతకముందు ఎడ్లకు ఏరువాక పూజలు చేశారు. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. 80% రాయితీపై రైతు సంఘానికి డ్రోన్ ను వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా అందించినట్లు తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు రాయితీపై అందజేస్తున్నామన్నారు.