చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రంలో భూ రికార్డులను మొట్టమొదటిసారిగా కంప్యూటరైజేషన్ జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం ఆమె శాసనసభలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చినట్లు విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పాపం వల్లే రెవెన్యూ, పోలీసు శాఖలో ఎక్కువగా గ్రీవెన్సులు వస్తున్నాయన్నారు. భూకబ్జాల నిరోధక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు.