చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్ కుట్రలు సాగవంటూ హో మంత్రి వంగలపూడి అనిత శనివారం ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ కే చెల్లిందంటూ విమర్శలు గుప్పించారు.