హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం కృష్ణాజిల్లా ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఉయ్యూరు మండలం గండికోటలో కొత్తగా దీనిని నిర్మించినట్లు హోంమంత్రి ఎక్స్ లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన దాత వెంకట స్వామికి కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.