మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దని వైసీపీకి హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన 9వ రోజు అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టమని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అంటే క్రిమినల్స్‌కు భయమని అన్నారు. క్రైం చేయాలంటేనే వణికిపోయేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు.