రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానెళ్ళను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం పాయకరావుపేట పట్టణంలో కూటమి పార్టీల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మంగవరం రోడ్డు సెంటరులోగల పెదిరెడ్డి కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా గౌతమ్ థియేటర్ సెంటర్ వరకూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.