ఎస్.రాయవరం సబ్ స్టేషన్ పరిధిలోని ఈనెల 12న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ఈఈ రాజశేఖర్ మంగళవారం తెలిపారు. ఆర్.డీ.ఎస్.ఎస్. పనులు నిర్వహిస్తున్న కారణంగా ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు ఎస్.రాయవరం, ఉప్పరాపల్లి, వెంకటాపురం, లింగరాజుపాలెం, జేవీపాలెం, సర్వసిద్ధి, సైతారుపేట, వాకపాడు, కృష్ణాపురం, పులపర్తి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.