నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శివయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో భోగిమంట వెలిగించారు. విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో కాలేజీ ఆవరణ అలంకరించారు. ముగ్గులు పోటీల్లో విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు అధ్యాపకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.