ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో షటిల్ టోర్నమెంట్ మంగళవారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను సీఐ. ఎల్. రామకృష్ణ, లింగంపల్లి జ్యోతి కుమార్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ను మాలెం రాజు ఆధ్వర్యంలో బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బలంకి రాజు, ఏవీఎస్, మురళి తదితరులు పాల్గొన్నారు.