ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోవింద్, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, మధు వర్మ, గుడివాడ సర్పంచ్ శ్రీనుబాబు, జిల్లా సెక్రెటరీ శ్రీను పాల్గొన్నారు.